Monday, December 23, 2024

ఈవిఎం స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భవేశ్ మిశ్రా

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి కలెక్టరేట్: కట్టుదిట్టమైన నిఘా నీడలో ఈవిఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ 24 గంటలు సిసి కెమెరాల పర్యవేక్షణలో ఉండాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. గురువారం అంబేద్కర్ స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేయు భూపాలపల్లి నియోజకవర్గం ఈవిఎం స్ట్రాంగ్ రూమ్‌ను, ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి భవేశ్ మిశ్రా పరిశీలించారు. ఇప్పటికే మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి కావడంతో స్ట్రాంగ్ రూమ్‌లకు ఈవిఎం, కంట్రోల్ యూనిట్, వివి ప్యాట్‌లను త్వరలో తరలించడం జరుగుతుందని పేర్కొన్నారు.

స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచించారు. రెండవ ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్న అనంతరం పోలింగ్ కొరకు సామాగ్రిని తరలించడంలో సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా ఏర్పాట్లను సమీక్షించుకోవాలని రిటర్నింగ్ అధికారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్‌పి కిరణ్ ఖరే, అదనపు కలెక్టర్ కె వెంకటేశ్వర్లు, ఆర్‌డిఓ రమాదేవి, డిఎస్‌పి రాములు, భూపాలపల్లి తహసీల్దారు శ్రీనివాస్, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News