Monday, December 23, 2024

సిఎం కెసిఆర్ వెంట జిల్లా నేతలు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : మహారాష్ట్ర పర్యటనలో రెండో రోజైన మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కనే పార్టీ పార్లమెంటరీ నేత కే. కేశవరావు, లోక్ సభ లీడర్ నామా నాగేశ్వరరావు .రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవి చంద్ర, బండి పార్ధ సారధి రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి, తాతా మధు కూడా ఉన్నారు. వీరంతా కలసి స్థానికంగా ప్రత్యేకించి, అపూర్వ రీతిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కేసీఆర్ ఇవాళ ఉదయాన్నే పండరీపూర్‌కు చేరుకుని శ్రీవిట్టల్ రుక్మిణీ ఆలయాన్ని సందర్శించారు. దైవ దర్శనం కోసం సీఎం ఆలయం ఆవరణలోని దుకాణ సముదాయాల నడుమ నడుచుకుంటూ వెళ్తుండగా ఓ వృద్ధ భక్తుడు ఆయనకు విఠలేశ్వరుడు, రుక్మిణీ అమ్మవార్లతో కూడి ఉన్న ప్రతిమను బహూకరించారు. సీఎం కేసీఆర్ ఎంతో వినమ్రంగా వృద్ధుడి నుంచి ఆ ప్రతిమను స్వీకరించారు. అంతకుముందు ఆలయ సమీపంలో సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ శ్రేణులు వాహనం దిగి ఆలయం ఉత్తర ద్వారం దాకా నడుచుకుంటూ వెళ్లారు. ఈ సందర్భంగా స్థానికులు సీఎంను చూసేందుకు పోటీపడ్డారు. సీఎం కేసీఆర్ దారికి ఇరువైపున ఉన్న ప్రజలకు అభివాదం చూస్తూ ముందుకు కదిలారని ఎంపి నామా నాగేశ్వరరావు తెలిపారు.కాగా ఈ సందర్భంగా ఎంపీ నామా నాగేశ్వరరావును ఘనంగా శాలువా తో సన్మానించారు.

  • తులజాపూర్ భవానీ మాత ఆలయ సందర్శన

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేసీఆర్, మంత్రులు తన్నీరు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకరరావు, గంగుల కమలాకర్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, ఎంపీలు కే.కేశవరావు,నామా నాగేశ్వరరావు, జోగినపల్లి సంతోష్ కుమార్, దీవకొండ దామోదర్ రావు, కేఆర్.సురేష్ రెడ్డి, బండి పార్థసారథి రెడ్డి, మాలోతు కవిత, బోర్లకుంట వెంకటేష్ నేతకానిలతో కలిసి సుప్రసిద్ధ తులజాపూర్ భవానీ మాత ఆలయాన్ని సందర్శించారు. అమ్మ వారిని దర్శించుకునేందుకు విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన బృందానికి వేద పండితులు పూర్ణకుంభం, మంగళవాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ భవానీ మాతకు నూతన పట్టువస్త్రాలు సమర్పించారు. ఎంపి రవిచంద్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎంపీలు తమ తమ గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు సిఎం కెసిఆర్‌కు ఆలయ స్థల పురాణం, విశిష్టతను వివరించారు.

కెసిఆర్, మంత్రులు, ఎంపిలకు వేద పండితులు తమ ఆశీర్వచనాలు పలికి, శాలువాలతో సత్కరించారు, అమ్మ వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దగ్గర నుంచి చూసేందుకు భక్తులు, స్థానికులు ఆసక్తి చూపుతూ చేతులూపారు, సంతోషం వ్యక్తం చేశారు. కెసిఆర్ వారికి నమస్కరిస్తూ ముందుకు సాగారు. అనంతరం సర్కోలి గ్రామానికి, సభాస్థలికి చేరుకున్న కెసిఆర్, మంత్రులు ఎంపీలకు గులాబీ పూలు చల్లుతూ స్థానిక మహిళలు, చప్పుళ్లు, టపాకాయాలతో ఘన స్వాగతం పలికిన స్థానికులు మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా పండరీపురం తాలూకా సర్కోలిలో ఎన్సీపీ నాయకుడు భగరీథ భరత్ బాల్కే మంగళవారం మధ్యాహ్నం జరిగిన సభలో ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మంత్రులు తన్నీరు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకరరావు, గంగుల కమలాకర్, జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి,సత్యవతి రాథోడ్, బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు, లోకసభలో బీఆర్‌ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, రాజ్యసభలో తన సహచర సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, బండి పార్థసారథి రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, లోకసభ సభ్యులు బిబి.పాటిల్, బోర్లకుంట వెంకటేష్ నేతకాని, మాలోతు కవిత, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పాల్గొన్నారు. ఈ సభకు గులాబీ శ్రేణులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా కెసిఆర్ పలువురికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News