Monday, December 23, 2024

జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయంగా ఎదగాలి

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి : జిల్లా విద్యార్థులు, క్రీడాకారులు క్రీడల్లో అంతర్జాతీయంగా రాణించాలని చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ పేర్కొన్నారు. 37వ అంతర్జాతీయ ఒలంపిక్ దినోత్సవం సందర్భంగా జిల్లా ఒలంపిక్ స్టీరింగ్ కమిటీ, జిల్లా క్రీడల శాఖ ఆధ్వర్యంలో రెండు కిలో మీట్లర ఒలంపిక్ రన్‌ను సంగారెడ్డిలో శుక్రవారం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయిన ఆయన మాట్లాడుతూ జిల్లాలో అనేక మంది క్రీడాకారులున్నారని, వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడం ద్వారా అంతర్జాతీయంగా రాణిస్తారన్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా క్రీడాకారులను ప్రోత్సహించాలని సూచించారు.మారు మూల ప్రా ంతాల్లో క్రీడాకారులకు కొదువ లేదని, ఎంతో కష్టపడి అనేక క్రీడల్లో మంచి ప్రతిభ కనబరుస్తున్నారని అన్నారు.

జిల్లా క్రీడాకారులు మరింత ప్రతిభ కనబర్చడం ద్వారా జిల్లాకు అంతర్జాతీయంగా పేరు తీసుకురావాలన్నారు. జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఛైర్మన్ చంద్రశేఖర్,కన్వీనర్ హరికిషన్,కో కన్వీనర్లు వెంకటేశం,ఎండి జావీద్ అలీ,హనుమంత్ గౌడ్, జిల్లా క్రీడాభివృద్ది అధికారి రాంచంద్రరావు,జూడో అసోసియేషన్ అధ్యక్షుడు పట్నం మాణిక్యం,వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు పులి మామిడి రాజు,కార్యదర్శి దశరత్,వాలీ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు,ఎస్‌జిఎఫ్ సెక్రటరీ ఆసిఫ్ , వివిధ పాఠశాలల పిఇటిలు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News