Monday, November 18, 2024

జిల్లా గణాంకదర్శిని పుస్తకావిష్కరణ

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: గణాంకాలు అనేవి సామాజిక, ఆర్థిక,ప్రణాళిక విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి పథంలో నడవడానికి అయువుపట్టుగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి పి. సుబ్బారావు ఆధ్వర్యంలో సోమవారం జిల్లా గణాంకదర్శిని (హ్యాండ్‌బుక్‌ఆఫ్ స్టాటిస్టిక్స్.2021.. 2022) పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా సమగ్ర గణాంక దర్శిని పుస్తకాన్ని రూపొందించిన ముఖ్య ప్రణాళిక అధికారితో పాటు వారి సిబ్బంది సేవలను కలెక్టర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్, ఎం.డేవిడ్, జిల్లా స్టాటిస్టికల్ అధికారిని కె. విజయలక్ష్మీ, ఉప గణాంక అధికారులు ఎస్. వెంకటేశ్వర్లు, జిన్నారెడ్డి శ్రీనివాసులు, ఇతర శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News