Monday, December 23, 2024

జాతీయ స్థాయి ఇన్‌స్పైయిర్ అవార్డుకు జిల్లా విద్యార్థి ఎంపిక

- Advertisement -
- Advertisement -


మన తెలంగాణ,సిటీబ్యూరో: జాతీయ ఇన్నోవేషన్ ఫౌండేషన్ గుజరాత్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్దాయి ఇన్‌స్పైయిర్ పోటీలకు జిల్లా విద్యార్థి ఎంపికయ్యాడు. రాష్ట్రం నుంచి ఎంపికైన 37మంది విద్యార్థులకు నగరంలోని ఐఐటీ ప్రొపెసర్లతో మెంటర్షిప్ ఓరాక్షన్ నిర్వహించారు. జిల్లా నుంచి హిమాయత్‌నగర్ మండలం సెయింట్ పాల్స్ హైస్కూల్ నుంచి 9వ తరగతి విద్యార్థి అమర్తా వరహాల ప్రదర్శించిన ప్రాజెక్టు కోవిడ్ బ్యాడ్జి పరికరం ఆకట్టుకుంది.

ఈపరికరం కోవిడ్ విస్తరిస్తున్న సమయంలో స్వల్పమైన జ్వరంతో ఆరంభమయ్యే కోవిడ్ వ్యాధి ఇది. తక్షణమే గుర్తించే వీలుగా బ్యాట్స్ రూపొందించాడు. దీని ఉపయోగాలు తెలుసుకున్న ఐఐటీ డైరెక్టర్, ప్రొపెసర్లు ప్రత్యేకంగా అభినందించి మరికొన్ని సూచనలు చేశారు. అలాగే రెండు రోజులు ఐఐటీ ప్రొపెసర్లు ఇన్‌స్పైయిర్లు ఎంపికైన విద్యార్థులకు ఎలక్ట్రో మెక్రోస్కోప్, టెలిస్కోప్, త్రీడీ ప్రింటింగ్,మెకానిక్ ల్యాబ్, డ్రోన్‌ల తయారీ వంటి అనేక అంశాలపై అవగాహన కల్పించారన్నారు. జాతీయ స్దాయిలోను అవార్డు సాధించాలని జిల్లా విద్యాధికారి ఆర్. రోహిణి పేర్కొన్నారు. ఈసందర్భంగా గైడ్ టీచర్ శర్వానీని జిల్లా సైన్సు అధికారి ధర్మేంధర్‌రావు, స్కూల్ ప్రధానోపాధ్యాయులు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News