- Advertisement -
జకార్త: ఇండోనేషియా రాజధాని జకార్త నుంచి 62 మంది ప్రయాణికులతో గత శనివారం బయల్దేరిన కొద్ది నిమిషాలకే కూలిపోయిన శ్రీవిజయ ఎయిర్‌వేస్‌కు చెందిన బోయింగ్ విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్‌ను నౌకాదళానికి చెందిన గజ ఈతగాళ్లు మంగళవారం జావా సముద్రం నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ విమానం కూలిపోవడానికి దారితీసిన కారణాలు బ్లాక్ బాక్స్ ద్వారా వెల్లడి కావచ్చని అధికారులు భావిస్తున్నారు. బ్లాక్ బాక్స్‌తో కూడిన తెల్ల కంటెయినర్‌ను నౌకాదళ సిబ్బంది ఒక నౌకలో తీసుకువస్తున్న దృశ్యాలను స్థానిక టీవీలు ప్రసారం చేశాయి. అయితే ఈ పరికరం విమానానికి చెందిన ఫ్లైట్ డాటానా లేక కాక్‌పిట్ వాయిస్ రికార్డరా అన్న విషయం నిర్ధారణ కాలేదు. ఈదుర్ఘటనను దర్యాప్తు చేస్తున్న జాతీయ రవాణా భద్రతా కమిటీకి దీన్ని అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
- Advertisement -