ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానాన్ని బెంగళూరుకు, ముంబై,
విశాఖ నుంచి వచ్చేవాటిని విజయవాడకు, బెంగళూరు విమానాన్ని
నాగ్‌పూర్‌కు మళ్లింపు వాతావరణం అనుకూలించలేదని అధికారుల వెల్లడి
మన తెలంగాణ/ శంషాబాద్ / హైదరాబాద్ : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. గురువారం సా యంత్రం నగరంలో కురిసిన వర్షాల కారణంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రా వాల్సిన నాలుగు విమానాలను అధికారులు వెన క్కి పంపించారు. ఢిల్లీ, ముంబయి, విశాఖ, బెంగుళూరు నుంచి శంషాబాద్‌కు రావాల్సిన విమానాలను దారి మళ్లించారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ రావాల్సిన విమానాన్ని బెంగుళూరుకు, ముంబ యి, విశాఖ నుంచి రావాల్సిన విమానాలను విజయవాడకు. బెంగుళూరు నుంచి రావాల్సిన విమానాన్ని నాగపూర్‌కు దారి మళ్లించారు. వాతావరణం అనుకూలించకపోవడంతోనే విమానాలు దారి మళ్లించాల్సి వచ్చిందని విమానాశ్రయ సంస్థ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌లో ఉదయం నుంచి ఎండ వేడికి ఇబ్బంది పడ్డ నగరవాసులను సాయంత్రం కురిసిన చిరుజల్లులతో వాతావరణం చల్లబడి ఉపశమనం లభించింది. నగరంలోని కొండాపూర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, కొత్తపేట, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది.
కూకటపల్లి, కెపిహెచ్‌బి కాలనీ, హైదర్‌నగర్, ప్రగతినగర్, నిజాంపేట్, మలక్‌పేట ప్రాంతాల్లో ఈదురుగాలులు. ఉరుములతో కూడిన వర్షం కురిసింది. పాతబస్తీ ప్రాంతంలోని చాంద్రాయణగుట్ట, బార్కాస్, ఫలకునామా తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. తీగలగూడలో ఈదురుగాలులతో భారీ చెట్టు కూలింది. సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలు బీభత్సం సృష్టించాయి. పటాన్‌చెరు. రామచంద్రాపురం, బిహెచ్‌ఎల్, అమీన్‌పూర్‌లో భారీగా ఈదురుగాలులు వీచాయి. ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో వడగండ్ల వర్షం కురిసింది. పడగండ్ల వర్షానికి ఓ ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. వర్షాల కారణంగా గ్రేటర్ పరిధిలో డిజాస్టర్ బృందాలను అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.