- Advertisement -
హైదరాబాద్ : ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ అధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (సెంటర్ స్టేట్ రిలేషన్స్ విభాగం) జాయింట్ సెక్రటరీ పార్థసారథి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎపి అధికారులు ఎస్.ఎస్ రావత్, ప్రేమ్‌చంద్రారెడ్డి (ఎపి రీఆర్గనైజేషన్ సెక్రెటరీ), రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాధ్‌దాస్‌తో పాటు తెలంగాణ నుంచి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు,
తెలంగాణభవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ హాజరయ్యారు. ఎపి భవన్ విభజనపై తమ అభిప్రాయాలను కేంద్ర హోంశాఖకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారులు వెల్లడించారు. జనాభా ప్రాతిపదిక లెక్కన తెలంగాణ రాష్ట్రానికి 8.41 ఎకరాలు (41.68 శాతం), ఆంధ్రప్రదేశ్‌కు 11.32 ఎకరాలు (58.32శాతం) దక్కనున్నాయి.
- Advertisement -