Friday, November 22, 2024

టిఆర్‌ఎస్‌లో పదవుల వేట

- Advertisement -
- Advertisement -

Division presidents hunt for positions in TRS

డివిజన్ అధ్యక్షుల కోసం స్థానిక నేతల పైరవీలు
పదవుల ఎంపికలో కీలకంగా మారిన ఎమ్మెల్యేలు
మంత్రులతో సిపారసు చేయించుకుంటున్న నాయకులు
మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఇంటి ఆశావాహుల సందడి

హైదరాబాద్: గ్రేటర్ టిఆర్‌ఎస్ పార్టీలో పదవుల వేట మొదలైంది. వచ్చే నెలల నుంచి పూర్తి స్థాయిలో కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేస్తామని గులాబీ బాస్, సిఎం కెసిఆర్ ప్రకటన చేయడంతో నగర నాయకులు పదవులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పదవుల ఎంపికలో స్దానిక ఎమ్మెల్యేలు కీలకంగా మారడంతో వారిని మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు నాయకగణం. టిఆర్‌ఎస్ కార్పొరేటర్ ఉన్న డివిజన్ పోటీ తక్కువగా ఉన్న, బిజెపి కార్పొరేటర్లు ఉన్న ఏరియాల్లో డివిజన్ అధ్యక్షులు పదవులు దక్కించేందుకు శ్రేణులు పోటీ పడుతున్నారు. అక్కడ పదవి లభిస్తే భవిష్యత్తులో కార్పొరేటర్‌గా పోటీ చేసే అవకాశం వస్తుందని అంచనా వేస్తూ ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతూ, హుజురాబాద్ ఎన్నికల్లో తమ అనుచరులతో పార్టీ గెలుపుకోసం పనిచేస్తామని పేర్కొంటున్నట్లు శాసనసభ్యులు అనుచరులు వెల్లడిస్తున్నారు.

దీనికి తోడు పార్టీలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు చేరడంతో ఎలాగైన డివిజన్ కీలక పదవిని కైవసం చేసుకునేందుకు టిఆర్‌ఎస్ పార్టీ అవిర్భవ నేతలంతా రంగంలోకి దిగారు. కొంతమంది నాయకులు యువనేత, మంత్రి కెటిఆర్, ఎమ్మెల్సీ కవిత అనుచరులుగా చెప్పుకుంటూ వారి అండదండలతో పార్టీలో ఉన్నత పదవి దక్కించుకుంటానని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానంగా సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న డివిజన్‌లకు బాగా డిమాండ్ పెరిగింది. ఆశావాహులంతా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఆయన తనయుడు సాయియాదవ్ చుట్టు తిరుగుతున్నారు. గడిచిన ఎన్నికల్లో కార్పొరేటర్‌గా అవకాశం ఇవ్వలేదని, డివిజన్ అధ్యక్షులుగా చాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. బిజెపి కార్పొరేటర్లు ఉన్న 47 డివిజన్లలో 05మంది వరకు పోటీ పడుతున్నట్లు పార్టీ సీనియర్లు పేర్కొంటున్నారు.

పార్టీ పెద్దలు కూడా గ్రేటర్ పరిధిలో పార్టీ కోసం శ్రమించే వారికి పదవులు కట్టబెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ నెలాఖరులోగా జనరల్ కమిటీతో పాటు, యువజన, మహిళా, లీగల్ సెల్, విద్యార్ది విభాగాలను భర్తీ చేయనున్నట్లు సుమారుగా 1100మందికి పార్టీ బాధ్యతలు అప్పగించి విపక్ష పార్టీల విమర్శలకు బుద్ది చెబుతామని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. అదే విధంగా సిఎం కెసిఆర్ ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెడితే కాంగ్రెస్,బిజెపి నాయకులు ప్రజలను తప్పుదారి పట్టిస్తూ తమ హయాంలోనే ఈపథకాలు పెట్టామని సొంత డబ్బా కొట్టుకుంటున్నారని,వారి మాటలకు తగిన సమాధానం ఇస్తామంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News