Tuesday, January 21, 2025

భార్య వద్ద అంగస్తంభన ప్రతిష్టంభన..యువ దంపతులకు విడాకులు

- Advertisement -
- Advertisement -

ఓ మగాడికున్న వింత వంధ్యత్వం లేదా విచిత్ర నపుసంకత్వం భార్యతో విడాకులకు దారి తీసింది. దాంపత్య జీవితం విఫలమైంది. బొంబాయి హైకోర్టు అనుబంధ ఔరంగబాద్ కోర్టు ఇటీవలే తమ ముందుకు వచ్చిన దాంపత్య కేసులోని ప్రత్యేకతను పరిగణనలోకి తీసుకుని దంపతులకు విడాకులు మంజూరు చేసింది. జీవితాంతం వారు భార్యభర్తలుగా ఉంటూ , దాంపత్య సుఖం అందుకోలేక , నిరాశా నిస్పృహలతో ఉండటం కన్నా వీరు విడిపోవడం మంచిది, విడాకులే మార్గం అని పేర్కొంటూ కీలక నిర్ణయం వెలువరించింది. భర్తకు పూర్తి స్థాయిలో నపుసంకత్వం లేదు, కానీ భార్య వద్దకు శృంగార దశలో అంగస్తంభన జరగకపోవడం పెద్ద సమస్య అయింది. దీనిని పెళ్లయిన కొద్దిరోజులకే ముందు భర్త తరువాత ఇద్దరూ గుర్తించారు.

దీనితో ఈ ఏడాది ఫిబ్రవరిలో తనకు విడాకులు ఇప్పించాలని కింది కోర్టుకు వెళ్లింది. అయితే విడాకులకు కోర్టు నిరాకరించింది. దీనితో ఔరంగాబాద్‌కు వెళ్లిన భర్తకు పరిస్థితిని సమీక్షించుకుని కోర్టు ఇరువురు కోరుకున్నట్లుగా విడాకులు మంజూరు చేసింది. ఇతరుల వద్ద ఆయనకు అంగస్తంభన సమస్య లేదు. భార్య దగ్గరికి వచ్చేసరికే ఈ విచిత్రత నెలకొందని ఈ క్రమంలో వీరి దాంపత్యం సుఖం కన్నా శోకం మిగులుస్తుందని నిర్థారించుకుని విడాకులు వెలువరిస్తున్నట్లు న్యాయమూర్తులు విభా కంకణ్‌వాది, ఎస్‌జి చపల్‌గాంకర్ ధర్మాసనం తీర్పు వెలువరించింది. దీనితో ఈ దంపతుల వివాహబంధం కంచికివెళ్లింది. యువదంపతులకు తగు న్యాయమే తమ ధర్మం అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ యువ దంపతులకు గత ఏడాది మార్చిలోనే పెళ్లయింది. అయితే 17రోజులు తిరగకుండానే వీరి మధ్య ఈ సంకట స్థితి అడ్డుగోడలకు దారితీసింది. ఈ 26, 27 ఏండ్ల యువజంట భార్యభర్తల స్థాయి నుంచి మంచి స్నేహితుల దశకు చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News