Wednesday, January 29, 2025

దివ్వెల మాధురి కారు ప్రమాదం…కలరింగ్ స్పందన

- Advertisement -
- Advertisement -

పలాస: ఇటీవల కాలం నుంచి వార్తల్లో నిలుస్తున్న శాల్తీ దివ్వెల మాధురి.  అతివేగంగా కారు నడిపి ఆగి ఉన్న మరో కారును ఢీకొట్టింది. ఆమె తలకు చిన్న గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  కాగా కారు ప్రమాదానికి తనదైన స్వంత కథనంతో ఆమె కలరింగ్ ఇచ్చుకొంటోంది.

టెక్కలి నుంచి పలాసవ వైపుకు సెల్ఫ్ డ్రియివింగ్ చేసుకుంటూ వెళుతుండగా పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా ప్రమాదంపై మాధురి తనదైన కథనం వినిపించింది. యాదృచ్చికంగా జరిగిన ప్రమాదం కాదని, వాణి చేస్తున్న ఆరోపణలు భరించలేకే చావాలనుకున్నానని, బతకాలని లేదని…అందుకు ఆత్మహత్యే దారని ఎంచుకున్నానని తెలిపింది. పైగా చికిత్స కూడా అందించి బతికించొద్దని కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News