Monday, December 23, 2024

9 రోజులు… ఆరు పుణ్యక్షేత్రాలు

- Advertisement -
- Advertisement -
ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చిన ఐఆర్‌సిటిసి

మనతెలంగాణ/హైదరాబాద్ : ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి)టూరిజం ప్రత్యేక టూర్ ప్యాకేజీలను తీసుకొచ్చింది. ప్రస్తుతం తమిళనాడులోని ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించేందుకు అనువుగా ‘దివ్య దక్షిణ్ యాత్ర విత్ జ్యోతిర్లింగ’ పేరుతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఎనిమిది రోజుల్లో 6 పుణ్యక్షేత్రాలను చుట్టివచ్చేలా దీనిని రూపొందించింది. 8 రాత్రులు/ 9రోజుల వ్యవధిలో ఈ యాత్రను ముగించేలా ఐఆర్‌సిటిసి షెడ్యూల్‌ను రూపొందించింది. ఈనెల 09 వతేదీన, సెప్టెంబర్ 05వ తేదీన ఈ యాత్ర ప్రారంభమవుతుందని ఐఆర్‌సిటిసి పేర్కొంది. ఈ యాత్రలో భాగంగా తిరువణ్ణామలై (అరుణాచలం ఆలయం). రామేశ్వరం (రామనాథస్వామి ఆలయం), మధురై(మీనాక్షి అమ్మన్ ఆలయం), కన్యాకుమారి (రాక్ మెమోరియల్, కుమారి అమ్మన్ టెంపుల్), త్రివేండ్రం (శ్రీ పద్మనాభస్వామి ఆలయం), తిరుచ్చి(శ్రీ రంగనాథస్వామి ఆలయం), తంజావూరు (హదీశ్వరాలయం)లను ఈ యాత్రలో చూపిస్తారు. ప్రయాణికులు ఈ యాత్రను బుక్ చేసుకుంటే సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్‌లలో ఎక్కాల్సి ఉంటుంది.
భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో ప్రయాణం
ఐఆర్‌సిటిసి ప్రత్యేకంగా రూపొందించిన భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో ఈ యాత్రను సందర్శన ఉంటుంది. సెకండ్ ఏసి, థర్డ్ ఏసి, స్లీపర్ క్లాస్‌లో పర్యాటకులు ప్రయాణించవచ్చు. ఈ రైలులో మొత్తం 716 బెర్తులు అందుబాటులో ఉంటాయి. ఇది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందుబాటులో ఉంటుంది. సికింద్రాబాద్‌లో ప్రారంభమయ్యే ఈ యాత్ర కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తుంది.
ప్రయాణం ఇలా..
మొదటిరోజు: భారత్ గౌరవ్ రైలు సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది.
రెండోరోజు: ఉదయం 9 గంటలకు తిరువణ్ణామలై వెళ్తారు. అక్కడ ఏర్పాటు చేసిన వసతి వద్దకు వెళ్లి స్నానాలు చేసి అరుణాచలం ఆలయానికి వెళ్తారు. అక్కడ దర్శనం పూర్తయిన తర్వాత తిరిగి రైల్వే స్టేషన్‌కు వచ్చి మన్మధురై వెళ్తారు.
మూడోరోజు: ఉదయం 8 గంటలకు మన్మధురై చేరుకుంటారు. అక్కడి నుంచి బస్సులో రామేశ్వరానికి వెళ్లి హోటల్ లోకి చెకిన్ అయ్యి ఫ్రెష్ అవుతారు. అక్కడ పుణ్యక్షేత్రాలు దర్శించుకోవచ్చు. ఇక్కడ ప్రయాణ ఖర్చులు యాత్రికులే భరించాల్సి ఉంటుంది. అనంతరం ముందుగా హోటల్లో బస, భోజనం ఉంటుంది.
నాలుగోరోజు: రామేశ్వరంలో మధ్యాహ్న భోజనం ముగించి మధురై ప్రయాణమవుతారు. సాయంత్రం మీనాక్షి అమ్మన్ ఆలయానికి వెళ్తారు. దర్శనం తర్వాత షాపింగ్ కోసం కొంత సమయం ఉంటుంది. తర్వాత రైలులో కన్యాకుమారి బయల్దేరతారు.
ఐదోరోజు: కన్యాకుమారి స్టేషన్ నుంచి ఫ్రెష్ అవడానికి వసతి వద్దకు వెళ్తారు. అక్కడ నుంచి వివేకానంద రాక్ మెమోరియల్, గాంధీ మండపాన్ని, సూర్యాస్తమయాన్ని ఆస్వాదించవచ్చు. రాత్రికి అక్కడే తిని బస చేయాల్సి ఉంటుంది.
ఆరోరోజు: ఉదయాన్ని హోటల్ నుంచి చెక్ ఔట్ అయ్యి నాగర్ కోయిల్ కి వెళ్తారు. త్రివేండ్రం (కొచువేలి)కి రైలులో బయలు దేరుతారు. ఆల్పాహారం ఆన్ బోర్డులోనే అందిస్తారు. కొచువేలి స్టేషన్ లో దిగి అక్కడి నుంచి పద్మనాభస్వామిని దర్శించుకొని కోవలం బీచ్ అందాలు వీక్షించొచ్చు. తర్వాత తిరుచిరాపల్లి బయల్దేరాలి.
ఏడోరోజు: ఉదయం 5 కి తిరుచిరాపల్లికి చేరుకుంటారు. ఉదయం శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ వెళ్లి దర్శనం తర్వాత మధ్యాహ్న భోజనం చేస్తారు. అక్కడి నుంచి 60 కి.మీ. దూరంలో ఉన్న తంజావూర్ వెళ్లి బృహదీశ్వర ఆలయ దర్శనం చేస్తారు. తర్వాత తంజావూర్ నుంచి సికింద్రాబాద్‌కు తిరుగు ప్రయాణం ఉంటుంది.
ఎనిమిది, తొమ్మిది రోజుల్లో: ఎనిమిదో రోజున ఆంధ్రాలో దిగే ప్రయణికులు వివిధ స్టేషన్‌లో దిగిపోవచ్చు. తొమ్మిదో రోజు తెల్లవారుజామున 2.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు.
ప్యాకేజీ ధరలు ఇలా..
ప్రయాణికులు మూడు తరగతుల్లో ప్రయాణించేందుకు అనుమతిస్తారు. అవి ఎకానమీ, స్టాండర్డ్, కంఫర్ట్. ఒక్కో దానికి ఒక్కో రకమైన ప్యాకేజీలు ఉంటాయి.
ఎకానమీ(స్లీపర్ క్లాస్) లో డబుల్ లేదా ట్రిపుల్ షేరింగ్ తో రూ. 14,300 చార్జీ చేస్తారు. అదే 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు అయితే రూ. 13,300లు చెల్లించాలి.
స్టాండర్డ్ (థర్డ్ ఏసి)లో అయితే డబుల్ లేదా ట్రిపుల్ షేరింగ్ తో రూ. 21,900లు చెల్లించాల్సి ఉంటుంది. 5 నుంచి 11 మధ్య ఉన్న పిల్లలకు అయితే రూ. 20,800 చార్జీ చేస్తారు.
కంఫర్ట్ క్లాస్ (సెకండ్ ఏసి)లో అయితే డబుల్ లేదా ట్రిపుల్ షేరింగ్ తో రూ. 28,500 చార్జీ చేస్తారు. 5 సంవత్సరాల నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ. 27,100లు చెల్లించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News