Monday, December 23, 2024

దివ్యవాణి వచ్చేశారు!

- Advertisement -
- Advertisement -

కొంతకాలంగా సినిమాలకు, రాజకీయాలకు దూరంగా ఉన్న ఒకప్పటి నటి దివ్యవాణి మళ్లీ రాజకీయరంగ ప్రవేశం. సినిమాల్లోకి కాకపోయినా, రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు నిర్ణయించుకున్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో దివ్యవాణి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేసిన విషయం తెలిసిందే. మహానాడులో తనను చిన్నచూపు చూశారని అలిగి, పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆమధ్య లక్ష్మణ్, కిషన్ రెడ్డిలను కలిశారు. దాంతో దివ్యవాణి బీజేపీలో చేరుతున్నారనే ఉహాగానాలు వినిపించాయి. అయితే తాజాగా ఆమె కాంగ్రెస్ తెలంగాణా ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News