మన తెలంగాణ / హైదరాబాద్ : కోట్లాది మంది కలలు సాకారం అవుతూ అటు అయోధ్యలో శ్రీరాముడు కొలువు దీరడంతో ప్రస్తుతం అందరి దృష్టి పవిత్ర పుణ్యక్షేత్రాలపై పడింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి ఇండియన్ రైల్వేస్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఐఆర్‌సిటిసి టూర్ ప్యాకేజీలను ప్రకటించిన విషయం తెలిసిందే. అది కూడా రైల్వే ప్రయాణికుల అభిరుచులకు తగ్గట్టు ఇండియన్ రైల్వేస్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతోంది కూడా. సంక్రాంతి లాంటి పడుగలు, సెలవులు, సీజన్‌ల ఆధారంగా స్పెషల్ టూర్ ప్యాకేజీలతో ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నది. ఇలాంటి యాత్ర ప్రారంభం నుంచి ముగింపు వరకు అన్ని రకాల వసతులను ఐఆర్‌సిటిసి కల్పిస్తు ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి ఇండియన్ రైల్వేస్ ఆధ్వర్యంలోని ఐఆర్‌సిటిసి టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తూ ఉంటోంది కూడా. అన్నింటికీ మించి ఇవి సీజన్‌కు తగ్గట్టుగానే ఉంటున్నాయి. ఉదా.. నవంబర్ లో కార్తీక మాసం ప్రారంభం అయినప్పుడు కూడా భక్తులు శివుడిని భక్తి శ్రద్ధలతో పూజించుకునే ఛాన్స్ ఇచ్చింది. ఈ క్రమంలో తాజాగా దక్షిణ మధ్య రైల్వే కూడా సుమారు 7 జ్యోతిర్లింగాల యాత్రకు ప్రత్యేక రైళ్లను నడపనుంది. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ యాత్రలో భాగంగా పవిత్ర పుణ్య క్షేత్రాల కోసం మంగళవారం ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం నెంబర్ 10 నుండి పలు జ్యోతిర్లింగాల దివ్యదర్శన్ యాత్ర ప్రారంభానికి గాను ప్రత్యేక రైళ్లను ప్రారంభిస్తోంది.