Thursday, January 23, 2025

భూదేవి కాంప్లెక్స్ లో దివ్యదర్శనం టోకెన్లు జారీ

- Advertisement -
- Advertisement -

తిరుమల : క‌లియుగ దైవం తిరుమ‌ల తిరుప‌తి శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని దర్శించుకోవ‌డానికి వ‌స్తున్న భ‌క్తుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు. టోకెన్లు పొందిన భక్తులు అలిపిరి మార్గంలో గాలిగోపురం 2083వ మెట్టు వద్ద తప్పనిసరిగా స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది.

లేనిపక్షంలో స్లాటెడ్ దర్శనానికి అనుమతించబడదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు. భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలని, అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరని స్పష్టం చేశారు. శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News