Monday, December 23, 2024

’రామారావు ఆన్ డ్యూటీ’లో అలాంటి బలమైన పాత్ర దక్కింది..

- Advertisement -
- Advertisement -

Divyanka Kaushik interview about 'Ramarao On Duty'

మాస్ మహారాజా రవితేజ చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ’రామారావు ఆన్ డ్యూటీ’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈనెల 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ విడుదలకు సిద్ధమవుతోన్న నేపధ్యంలో చిత్ర హీరోయిన్స్‌లో ఒకరైన దివ్యాంశ కౌశిక్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “ఈ సినిమాలో రవితేజతో స్క్రీన్ పంచుకోవడం గౌరవంగా భావిస్తున్నా. శరత్ కథ చెప్పినపుడు నా పాత్ర చాలా నచ్చింది. ఇందులో నందిని అనే పాత్రలో కనిపిస్తా. ఒక భార్యగా, తల్లిగా హోమ్లీగా కనిపిస్తా. నా పాత్రలో చాలా పరిణితి వుంటుంది. 95లో జరిగే ఈ కథ చాలా బలంగా వుంటుంది. ప్రేక్షకులు కోరుకునే అన్నీ ఎలిమెంట్స్‌తో ‘రామారావు ఆన్ డ్యూటీ’ థ్రిల్ చేస్తుంది. నా పాత్ర కోసం నెలన్నర పాటు యాక్టింగ్ వర్క్ షాప్‌లో పాల్గొన్నా. దర్శకుడు శరత్ పాత్రకి సంబంధించిన ప్రతి అంశాన్ని వివరంగా చెప్పేవారు. ప్రతి సీన్ గురించి ముందే చర్చించుకునేవాళ్ళం. ఒక నటిగా వైవిధ్యమైన పాత్రలు చేయాలనీ వుంటుంది. ’రామారావు ఆన్ డ్యూటీ’లో అలాంటి బలమైన పాత్ర దక్కింది. ఇక నేను అన్ని రకాల పాత్రలని చేయగలనే నమ్మకం వుంది. ఏదైనా బయోపిక్ చేసే సామర్ధ్యం వుందని నమ్ముతున్నా. ప్రస్తుతం సుదీర్ వర్మతో ఒక సినిమా, అలాగే మైఖేల్ అని మరో సినిమా చేస్తున్నా”అని అన్నారు.

Divyansha Kaushik interview about Ramarao On Duty

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News