ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో గ్లోబల్ సక్సెస్‌ను సాధించి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను, సినీ ప్రేక్షకులను మెప్పించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు తన ‘ఆర్‌సి16’ సినిమా షూటింగ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను మైసూర్‌లో ప్రారంభించారు. తొలి చిత్రం ఉప్పెనతో బ్లాక్‌బస్టర్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సమర్పణలో ఈ భారీ పాన్ ఇండియా సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమాలో భారీ తారాగణం కూడా నటిస్తున్నారు. కరుణడ చక్రవర్తి శివరాజ్ కుమార్ ఈ చిత్రంతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన చాలా పవర్‌ఫుల్ పాత్రలో మెప్పించబోతున్నారు.
తాజాగా ఇప్పుడు బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ దివ్యేందు ఇందులో కీలక పాత్రలో అలరించబోతున్నారు. మీర్జాపూర్‌లో మున్నాభాయ్ పాత్రలో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన దివ్యేందు ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. అలాగే టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు, కన్నడ స్టార్ హీరో శివన్న ముఖ్య పాత్రలో మెప్పించనున్నారు. ఈ సందర్భంగా దివ్యేందు పాత్రకు సంబంధించి దర్శకుడు బుచ్చిబాబు స్పందిస్తూ తనకు ఆర్‌సి16లో ఎంతో ఇష్టమైన పాత్ర ఇదేనని పేర్కొంటూ తన లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. మెలి తిప్పిన మీసం, రగ్డ్ లుక్‌లో దివ్యేందు సరికొత్త పాత్రలో మెప్పించబోతున్నారని స్పష్టమవుతుంది. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ క్వీన్ జాన్వీ కపూర్ ఇందులో కథానాయికగా మెప్పించనున్నారు.