Saturday, April 26, 2025

చార్మినార్ వద్ద దీపావళి వేడుకలు… భాగ్యలక్ష్మి దేవాలయానికి పోటెత్తిన భక్తులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భాగ్యనగరంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యంగా చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం భక్తులు కిటకిటలాడారు. గురువారం ఆలయంలో అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. దీపావళి వేడుకలో భాగంగా అమ్మవారి ఖజానాకు సంబంధించిన వెండి లక్ష్మీ నాణేలు పంపిణీ చేశారు. అమ్మవారి నాణేలను తీసుకోవడానికి వేలాది మంది భక్తులు ఆలయానికి పోటెత్తారు. దీంతో చార్మినార్ ఆవరణం అంతటా సందడి వాతావరణం నెలకొంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News