హైదరాబాద్: నగరంలో దీపావళి సంబురాలు అంబరాన్నంటాయి. అమావాస్య చీకట్లను చీల్చుకుంటూ దివ్వెల వెలుగులు విరజిమ్మాయి. కరోనా కారణంగా గత ఏడాది కళ తప్పిన అన్ని పండుగలన ఈ ఏడాది నగరవాసులు మరింత గొప్పగా జరుపుకుంటున్నారు. ఈ సంవత్సం నగరవాసులు ఎత్తున దీవాళి సంబురాలను జరుపుకోవడంతో సంతోషాలు వెల్లువిరిచాయి. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరూ సంతోషంలో మునిగి తెలారు. టపాసులు, కాలుస్తూ, మిఠాయిలు పంచుకున్ని సంబురాలు చేసుకున్నారు. తెల్లవారు జామునే మంగళ సాన్నాలు ఆచరించి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి నోములు, వత్రాలు జరుపుకున్నారు.
ఇళ్లలో బొమ్మల కొలువులను అందంగా ఆలకరించారు. వ్యాపార సముదాయాల్లో లక్ష్మీ పూజను ఘనంగా నిర్వహించి భారీగా టపాసులు పెల్చారు. ప్రజా ప్రతినిధులతో పాటు సినీతారలు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలపడంతో పాటు తమ తమ ఇళ్లల్లో ఘనంగా జరుపుకున్నారు. వాణజ్య, వ్యాపారానికి కేంద్రమైన హైదరాబాద్ నగరంలో లక్ష్మి పూజను భక్తిశ్రద్దలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా మిఠాయిలను పంచుకుని పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రాత్రంతా టపాసులు మోతలతో నగరం మారుమోగింది. తార జివ్వలను వెలుగులతో నగరం మురిసిపోయింది. విద్యుత్ దీపాల ప్రత్యేక ఆలంకరణాలతో నగరం శోభాయమనంగా మారింది. ప్రతి ఇంట్లో దీపాల వెలుగులతో నగరమంతా ద్వేదీప మాణ్యంగా వెలుగింది.