Sunday, December 22, 2024

నేడు స్టాక్ మార్కెట్ లో గంటపాటు దీపావళి ముహూరత్ ట్రేడింగ్!

- Advertisement -
- Advertisement -

ముంబై: స్టాక్ ఎక్స్ఛేంజ్ ముహూరత్ ట్రేడింగ్ శుక్రవారం సాయంత్రం 6.00 గంటల నుంచి 7.00 గంటల వరకు జరుగనుంది. సాధారణంగా సంవత్సరాది ఉగాది నుంచి ఆరంభమవుతుంది. అయితే స్టాక్ మార్కెట్లకు మాత్రం దీపావళితో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. స్టాక్ మార్కెట్లు శుక్రవారం పూర్తి స్థాయిలో పనిచేయకుండా, ఒక గంట సేపు మాత్రమే  ముహూరత్ ట్రేడింగ్ జరుగుతుంది.

దీపావళి సందర్భంగా చాలా మంది సెంటిమెంట్ తో ముహూరత్ ట్రేడింగ్ చేస్తారు. అది నేటి సాయంత్రం 6.00 నుంచి 7.00 గంటల వరకు ఉండబోతుంది. స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ చాలా రిస్క్ లతో కూడుకుని ఉంటుంది. ఎంతో డక్కామొక్కీలు తిన్న వారే నిలబడగలరు. స్టాక్ మార్కెట్ రిస్క్ తెలియని వారు మార్కెట్లోకి  రాకపోవడమే మంచిది. ఎందుకంటే అసలు పెట్టుబడికే ఎసరు పడవచ్చు.

ముహూరత్ ట్రేడింగ్.. స్లాట్ టైమ్ లో ఈక్విటీ, కమోడిటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, ఈక్విటీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్(SLB) వంటి సెగ్మెంట్లలో ట్రేడింగ్ జరుగుతుంది. నిన్న(అక్టోబర్ 31న) మార్కెట్ నడిచింది. నిన్న సెన్సెక్స్ 553 పాయింట్లు పతనమై 79389.06వద్ద, నిఫ్టీ 135 పాయింట్లు పతనమై 24205.35 వద్ద ముగిశాయి. ఇండియా విక్స్ 15.55 వద్ద ముగిసింది. సాధారణంగా స్టాక్ మార్కెట్లు ఉదయం 9.00 నుంచి 9.15 వరకు ప్రీమార్కెట్ ట్రేడింగ్, 9.15 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు మార్కెట్ సెషన్ ఉంటుంది. గత సంవత్సరం ముహూరత్ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 354.77 పాయింట్లు లేక 0.55 శాతం పెరిగి 65259.45 వద్ద ముగిసింది. నిప్టీ 100.20 పాయింట్లు పెరిగి 19525.55 వద్ద ముగిసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News