Sunday, January 19, 2025

హైదరాబాద్‌లో డిజెలపై నిషేధం

- Advertisement -
- Advertisement -

వెల్లువెత్తిన ఫిర్యాదులతో పోలీసు శాఖ నిర్ణయం నిబంధనలు
ఉల్లంఘిస్తే జైలుశిక్ష, జరిమానా మతపరమైన ర్యాలీల్లో
బాణసంచాపై ఆంక్షలు పరిమితస్థాయిలో సౌండ్‌సిస్టమ్‌కు
అనుమతి నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాలు

మనతెలంగాణ/సిటీ బ్యూరో: నగరంలో డిజెలు, ఫైర్ క్రాకర్స్‌లపై నిషేధం విధిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మంగళవారం ఆ దేశాలు జారీ చేశారు. నగర పరిధిలో ఇప్పటి నుంచి మతపరమైన ర్యాలీల్లో డిజేలు, ఫైర్ క్రాక ర్స్ ఉపయోగించవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇ చ్చారు. భారీ శబ్దాలతో డీజేలు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని హైదరాబాద్ వాసులు వరుసగా పోలీసులకు ఫిర్యాదులు చేయడంతో దీనిపై నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ దృష్టిసారించారు. ఈ క్రమంలోనే నగరంలోని రాజకీయ పా ర్టీల ప్రతినిధులు, అన్ని మతాల పెద్దలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు. చర్చల సమయంలో డిజేలు, ఫైర్‌క్రాకర్స్ వల్ల న గరం లో గతంలో జరిగిన సంఘటనల గురించి హైదరాబాద్ సిపి ప్రతినిధులకు వివరించారు. తర్వా త డిజేలపై నిషేధంపై ప్రభుత్వ నిర్ణయానికి పం పారు. ప్రభుత్వం నుంచి డిజే, ఫైర్ క్రాకర్స్‌పై ఆ దేశాలు రావడంతో వాటిని నిషేధిస్తు ఆదేశాలు జారీ చేశారు. అయితే సౌండ్ సిస్టమ్‌లను పరిమి తస్థాయిలో అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. సౌండ్ సిస్టమ్ పెట్టడానికి కూడా పోలీస్ క్లియరె న్స్ తప్పనిసరని స్పష్టం చేశారు. నాలుగు జోన్లలో సౌండ్ సిస్టమ్‌లు పెట్టడానికి డెసిబిల్స్‌ను నిర్దేశి స్తూ కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు.

జనావాసాల ప్రాంతంలో ఉదయం 55 డెసిబెల్స్‌కు మించి పెట్టరాదని తెలిపారు. అలాగే రాత్రి వేళల్లో 45డెసిబెల్స్‌కు మించరాదని పేర్కొన్నారు. మతపరమైన ర్యాలీల్లో బాణసంచా కాల్చడం పూ ర్తిగా నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. సౌండ్ సిస్టమ్స్ పరిమితికి మించి పెద్దపెద్ద శబ్దాలతో హంగామా చేసినా ఐదు సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ.లక్షల జరిమానా విధిస్తామని తెలిపారు. పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తే రోజుకు రూ.5వేల చొప్పున జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News