Saturday, January 18, 2025

జకోవిచ్, సబలెంక ముందుకు

- Advertisement -
- Advertisement -

నాలుగో రౌండ్‌లో గాప్, జ్వరేవ్, అల్కరాజ్
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ అరినా సబలెంక (బెలారస్), మూడో సీడ్ కొకొ గాఫ్ (అమెరికా) నాలుగో రౌండ్‌కు చేరుకున్నారు. అయితే ఏడో సీడ్ జెస్సికా పెగులా (అమెరికా) మూడో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. 11వ సీడ్ పౌలా బడోసా (స్పెయిన్), 18వ సీడ్ డొనా వెకిక్ (క్రొయేషియా) తదితరులు మూడో రౌండ్‌లో విజయం సాధించారు. పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ అలెగ్జాండర్ (జర్మనీ), మూడో సీడ్ కార్లొస్ అల్కరాజ్ (స్పెయిన్), ఏడో సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) తదితరులు నాలుగో రౌండ్‌లో ప్రవేశించారు. మాజీ ఛాంపియన్ జకోవిచ్ మూడో రౌండ్‌లో 61, 64, 64తో టొమస్ మచాక్ (చెక్)ను ఓడించాడు.

ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన జకోవిచ్ ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. రెండో సీడ్ జ్వరేవ్ కూడా అలవోకగా విజయం సాధించాడు. బ్రిటన్ ఆటగాడు జాకబ్‌తో జరిగిన మూడో రౌండ్‌లో జ్వరేవ్ 63, 64, 64తో జయకేతనం ఎగుర వేశాడు. కాగా, అల్కరాజ్ మాత్రం కాస్త చెమటోడ్చి నెగ్గాడు. మూడో రౌండ్‌లో అల్కరాజ్ 62, 64, 67,62తో నూనో బోర్గెస్(పోర్చుగల్)ను ఓడించాడు. ఇతర పోటీల్లో 15వ సీడ్ డ్రాపర్ (బ్రిటన్), 12వ సీడ్ పాల్ (అమెరికా) తదితరులు విజయం సాధించారు. మహిళల విభాగంలో మూడో సీడ్ గాప్ 64, 62తో ఫెర్నాండేజ్ (కెనడా)ను ఓడించింది. టాప్ సీడ్ సబలెంక 76, 64తో క్లారా టౌసన్ (డెన్మార్క్)పై అతి కష్టంతో విజయం సాధించింది. బడోసా కూడా మూడో రౌండ్‌లో చెమటోడ్చక తప్పలేదు. కొస్టియుక్ (ఉక్రెయిన్)తో జరిగిన పోరులో బడోసా 64, 46, 63తో జయభేరి మోగించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News