Monday, December 23, 2024

జకోవిచ్ అల్కరాజ్ ఢీ

- Advertisement -
- Advertisement -

నేడు పురుషుల సింగిల్స్ ఫైనల్
లండన్: వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్, మూడో సీడ్ కార్లొస్ అల్కరాజ్ (స్పెయిన్), మాజీ విజేత, రెండో సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా)ల మధ్య తుది పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి కిందటిసారి అల్కరాజ్ చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో జకోవిచ్ ఉన్నాడు. మరోవైపు అల్కరాజ్ ఈసారి కూడా టైటిల్ గెలవాలనే లక్షంతో పోరుకు సిద్ధమయ్యాడు. ఇటు అల్కరాజ్ అటు జకోవిచ్ అంచనాలను తగినట్టు రాణిస్తూ ఊహించినట్టే ఫైనల్‌కు దూసుకొచ్చారు. తుది పోరులో కూడా గెలవాలనే పట్టుదలతో ఇద్దరు ఉన్నారు. అపార అనుభవజ్ఞుడైన జకోవిచ్‌కు వింబుల్డన్‌లో కళ్లు చెదిరే రికార్డు ఉంది. తన ఆధిపత్యాన్ని ఈసారి కూడా చాటాలనే లక్షంతో జకోవిచ్ ఉన్నాడు. అల్కరాజ్ కూడా తన ఖాతాలో మరో వింబుల్డన్ టైటిల్‌ను జత చేసుకోవాలని తహతహలాడుతున్నాడు. ఇద్దరు సమవుజ్జీల మధ్య జరిగే పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News