Thursday, January 23, 2025

ఛాంపియన్ జకోవిక్

- Advertisement -
- Advertisement -

ఏడోసారి వింబుల్డన్ టైటిల్ కైవసం
ఓవరాల్‌గా 21వ గ్రాండ్‌స్లామ్

లండన్: సెర్బియా టెన్నిస్‌ప్టార్ నోవాక్ జకోవిక్ సంచలనం సృష్టించాడు. ఆదివారం జరిగిన వింబుల్డన్ టైటిల్ పోరులో గెలిచి ఏడోసారి ఛాంపియన్‌గా అవతరించాడు. ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు చెందిన నిక్ కిర్జియోస్‌తో తలపడిన జకోవిక్ తొలి సెట్ 46తో కోల్పోయినా తిరిగి పుంజుకొని వరుస గా రెండు సెట్లను 63 64లతో నిక్‌కు ఛాన్స్ ఇ వ్వకుండా అలవోకగా కైవసం చేసుకున్నాడు. కానీ, నాలుగో సెట్ కోసం వీద్దరి భీకరంగా పోరాడారు. తొలుత నిక్ 13 ఆధిక్యం సాధించినప్పటికీ నోవా క్ ఆటతీరుతో ముందుకెళ్లలేక పోయాడు నిక్. దీం తో నోవాక్ వరుస గేమ్‌లను గెలుపొంది 7(7) 6(3)లతో నాలుగో సెచ్‌లో విజయం సాధించాడు. దీం తో వింబుల్డన్ ఏడు సార్లు గెలిచాడు. ఓవరాల్‌గా నోవాక్ ఇప్పటి వరకూ 21 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచి రికార్డులకెక్కాడు. జకోవిక్ ఇప్పటి వరకు 9 ఆస్ట్రేలియా ఓపెన్, 2 ఫ్రెంచ్ ఓపెన్, 3 యుఎస్ ఓపెన్, 7 వింబుల్డన్ టైటిళ్లను గెలుకున్నాడు.

DJokovic Win 7th Time Wimbledon Title

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News