Wednesday, January 22, 2025

టెన్నిస్ రారాజు జొకో

- Advertisement -
- Advertisement -

 ఫ్రెంచ్ ఓపెన్ తుదిపోరులో కాస్పెర్‌రూడ్‌పై విజయం
 జొకోవిక్ ఖాతాలో 23వ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు
 ఆల్‌టైమ్ రికార్డు టైటిళ్లు గెలుచుకున్న సెర్బియా స్టార్
పారిస్: ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో 3వ సీడ్ నోవక్ జొకోవిక్(సెర్బియా) ఛాంపియన్‌షిప్‌గా నిలిచాడు. దీంతో నోవక్ జొకోవిక్ ఖాతాలో మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ వచ్చి చేరింది. టెన్నిస్ చరిత్రలో ఎక్కువ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు(23) గెలుచుకున్న ఆటగాడిన సరికొత్త రికార్డు నెలకొల్పాడు జొకోవిక్. నాదల్(22)ను వెనక్కి నెట్టి నంబర్ వన్‌గా అవతరించాడు. ఆదివారం జరిగిన తుది పోరులో నార్వేకు చెందిన కాస్పేర్‌రూడ్(4వ ర్యాంకు)పై జోకోవిచ్ ఘన విజయం సాధించాడు. 3 గంటలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో నోవక్ పైచేయి సాధించాడు. తొలి సెట్ 7-6తో చెమటోడ్డిన నోవక్, రెండో సెట్‌ను అలవోకగా 6-3తో కైవసం చేసుకున్నాడు.

ఇక నిర్ణయాత్మక మూడో సెట్ ఇరువురు నువ్వానేనా అన్నట్లు పోరాడారు. అయితే జొకోవిక్ తనదైన ఆటతీరుతో రూడ్‌కు అవకాశం ఇవ్వకుండా 7-5తో సొంతం చేసుకున్నాడు. కాగా, ఈ టైటిల్‌తో జొకోవిక్ ఖాతాలో మొత్తం 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నమొదయ్యాయి. అందులో ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు మూడు(2016, 2021, 2023), వింబుల్డన్ ఏడు(2011, 2014, 2015, 2018, 2019, 2021, 2022), ఆస్ట్రేలియా ఓపెన్ టైటిళ్లు పది (2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021, 2023), యుఎస్ ఓపెన్ టైటిళ్లు మూడు (2011, 2015, 2018) ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News