Wednesday, January 22, 2025

డికె అరుణ్ కూతురు క్రెడిట్ కార్డు దొంగతనం… రూ.11 లక్షలు మాయం చేసిన డ్రైవర్?

- Advertisement -
- Advertisement -

జూబ్లీహిల్స్: బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ కుమర్తె డికె శృతి రెడ్డి క్రెడిట్ కార్డును డ్రైవర్ చోరీ చేసి రూ.11 లక్షల రూపాయలు డ్రా చేసుకోడంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ప్రేమ పర్వత్ విల్లాస్‌లో శృతి రెడ్డి నివసిస్తున్నారు. శృతికి సంబంధించిన హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డును ఆమె కారు డ్రైవర్ దొంగలించాడు. మహావీర్ జెమ్స్ అండ్ పెరల్స్ ఆభరణాల దుకాణానికి వెళ్లి రూ.11 లక్షలు డ్రా చేసి తన వద్దనే ఉంచుకున్నాడు. ఆమె డ్రైవర్‌ను నిలదీయడంతో పొంతనలేని సమాధానాలు చెప్పుతుండడంతో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: ఇదేనా మీ అచ్చే దిన్…!?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News