Friday, November 22, 2024

సామెతలు ఆపి.. వాస్తవాలు మాట్లాడాలి : డికె అరుణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిఆర్‌ఎస్ నేతలు సామెతలు ఆపి, వాస్తవాలు మాట్లాడే సంస్కృతి నేర్చుకోవాలని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ అన్నారు. పాలమూరు జిల్లా పర్యటనలో భాగంగా బిజెపిపై బిఆర్‌ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యల పట్ల ఆమె స్పందించారు. జనహితం బిఆర్‌ఎస్ నేతల అభిమతం కాదని, ప్రజలను దోపిడీ చేయడమే వారి ధ్యేయమని డికె అరుణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను నిర్మించని వారు.. పాలమూరుకు వచ్చి నోటికి వచ్చినట్లు మాట్లాడిపోతే, ఇక్కడి ప్రజలు నమ్ముతారు అనుకోవడం భ్రమ అన్నారు. బిఅర్‌ఎస్ పార్టీ నాయకులే హత్యలు, లైంగిక దాడులు చేస్తూ పట్టుబడుతుంటే అవేవీ కనబడడం లేదని అని ఆమె మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News