Wednesday, January 22, 2025

మద్యం నోటిఫికేషన్‌పై ఉన్న శ్రద్ధ…. ఉద్యోగ నోటిఫికేషన్లపై లేదు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఎస్‌పిఎస్‌సిని వెంటనే ప్రక్షాళన చేయాలని బిజెపి నేత డికె అరుణ డిమాండ్ చేశారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేయడంపై డికె అరుణ్ స్పందించారు. నైతిక బాధ్యత వహించి చైర్మన్ రాజీనామా చేయాలని కోరారు. మద్యం నోటిఫికేషన్‌పై ఉన్న శ్రద్ధ, ఉద్యోగ నోటిపికేషన్లపై ఎందుకు లేదని ప్రశ్నించారు. నిరుద్యోగ యువత పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, బయోమెట్రిక్ పెడితే ఖర్చు అవుతుందని ప్రభుత్వం కక్కుర్తి పడిందని డికె అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బయోమెట్రిక్ లేకపోవడంతో నిరుద్యోగులు రోడ్డున పడ్డారని, మద్యం నోటిఫికేషన్లు తప్ప ఏ నోటిఫికేషన్లు సక్రమంగా జరగలేదన్నారు. శనివారం గ్రూప్-వ ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. జూన్11న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష టిఎస్‌పిఎస్‌సి నిర్వహించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News