Friday, January 10, 2025

ఎన్నికల్లో మోడీ మరోసారి గెలుస్తారని సిఎం రేవంత్‌రెడ్డికి తెలుసు

- Advertisement -
- Advertisement -

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారలోకి వచ్చే ప్రసక్తే లేదని, కూటమి ఏర్పాటు చేసిన రోజుకో పార్టీ దూరమైతుందని మహబూబ్‌నగర్ ఎంపి అభ్యర్థి డికె. అరుణ ఎద్దేవా చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి, మోడీనే గెలుస్తారనే విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా తెలుసని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ది చెందాలంటే కేంద్రంలో మరోసారి బిజెపి ప్రభుత్వమే అధికారంలోకి రావాలన్నారు.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీ 12 నుండి 15 స్థానాలు గెలుస్తుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు చీకటి ఒప్పందం చేసుకుని అభ్యర్థులను ఎంపికలో పరస్పర సహాకారం చేసుకుంటున్నారని విమర్శించారు. రోజు రోజుకు దేశంలో మోడీకి ఆదరణ పెరుగుతుండటంతో ఓర్వలేక ఈరెండు పార్టీలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు పార్టీల నాయకులు ఎన్ని రాజకీయ ఎత్తుగడలు వేసిన బిజెపి విజయాన్ని ఆపలేరని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News