Sunday, January 19, 2025

సిఎంకి కౌంటర్ ఇచ్చిన డికె అరుణ

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిజెపి మహిళ నేత బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి అని మర్చిపోయి సోయిలేకుండా మాట్లాడుతున్నారని అరుణ ఫైర్ అయ్యారు. నన్ను పండబెట్టి తొక్కి పార్లమెంట్ సీట్ గెలిపిస్తావా.. రా ఎడికొచ్చి తొక్కుతావో నేను చూస్తా అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన ఈ మాటలకు ప్రతి మహిళ బుద్ధి చెప్పాలని డీకే అరుణ పిలుపునిచ్చారు. శుక్రవారం సిఎం రేవంత్​ రెడ్డి మహబూబ్​నగర్​ లోక్​సభ నియోజకవర్గ అభ్యర్థి చల్లా వంశీచంద్​ రెడ్డి నామినేషన్​ కార్యక్రమంలో మాట్లాడుతూ… మిమ్మల్ని పండబెట్టి తొక్కుకుంటూ పార్లమెంటుకు కాంగ్రెస్ అభ్యర్దిని పంపిస్తామని సిఎం రేవంత్ అన్న మాట చర్చనీయాంశం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News