Sunday, December 22, 2024

రాహుల్ గాంధీపై మండిపడ్డ డికె అరుణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పార్లమెంట్ సమావేశాలలో కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరు మహిళల పట్ల వారికి గల చిన్న చూపుకు నిదర్శనమని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ మండిపడ్డారు. బుధవారం ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్‌లో రాహుల్ అసభ్య సంజ్ఞలతో మహిళా పార్లమెంట్ సభ్యుల పట్ల చిల్లరగా ప్రవర్తించడం అతని సంస్కారానికి నిదర్శనమని అన్నారు. పార్లమెంటులో ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేయడం, సంస్కారం లేకుండా ప్రవర్తించడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని డికె అరుణ తీవ్రస్థాయిలో ఆక్షేపించారు.‘

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News