Sunday, November 24, 2024

డికె అరుణ దారెటు?

- Advertisement -
- Advertisement -

గద్వాలపై విముఖత, ముళ్లును ముళ్లుతోనే తీయాలనే స్కెచ్, బిజెపి నుంచి రంగంలోకి బోయ వీరబాబు ?, పాలమూరు,
నారాయణపేట అసెంబ్లీకి పోటీ చేయాలని అధిష్ఠానం సూచన, అంతుబట్టని డికె అరుణ రాజకీయం, నడిగడ్డలో రెడ్లదే ఆధిపత్యం

మన తెలంగాణ/ మహబూబ్ నగర్ బ్యూరో:  నడిగడ్డ రాజకీయం రోజు రోజుకు గరం గరం గా మారుతోంది. అటు అలంపూర్, ఇటు గద్వాల నియోజకవర్గాలలో రాజకీయం రసవత్తరంగా సా గుతోంది.ముళ్లును ముళ్లుతోనే తీయాలనే రాజకీయానికి అరుణ తన మార్క్ రాజకీయానికి తెరలేపింది. కాంగ్రెస్‌ను ఓడించాలన్నదే లక్షంగా చేసుకొని రా జకీయ దంగల్‌కు సిద్ధమవుతోంది.ఈ నేపథ్యంలో నే గద్వాల నుంచి పోటీ చేసేందుకు డికె అరుణ వి ముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. డికె అరుణ ఇంత త్వరగా ఎందుకు నిర్ణయం తీసుకు ంది ? ఇందులో ఎలాంటి రాజకీయం ఉంది ? బిజె పి అధిష్టానంకు ఆమె చెప్పింది ? అమె మదిలో ఏ ముంది ? నారాయణపేట నుంచి పోటీ చేస్తుందా ? లేక పాలమూరు పార్లమెంట్‌కా ? లేక పార్టీ మా రబోతోందా ? అన్న ప్రశ్నలు తెలెత్తుతున్నాయి. ఏ ది ఏమైనా గద్వాల చుట్టూ రాజకీయం హాట్ హాట్ గా మారుతోంది. మూడు సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే గా గెలిచిన డికె అరుణ మొదిటిసారి 2014లో మే నల్లుడు బిఆర్‌ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.

డికె అరుణ గద్వాల జిల్లాలో తిరుగులేని రాజకీ య నేత. ఒంటిచేత్తో చక్రం తిప్పగల నేర్పరి. ఆ ప్రా ంత ప్రజలకు జేజమ్మగా గుర్తింపు.నడి గడ్డ రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నేత. ఏ పార్టీలో ఉన్నా తన బ్రాండ్ తనకు ఉంటుంది. ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన అనుభవం. కా ంగ్రెస్ నుంచి బిజెపిలోకి వెళ్లి ఆ పార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఎదిగిన రాజకీయ మేధావి. అం దరూ గద్వాల నుంచి పోటీ చేసుందని ఊహించా రు. బిజెపి విడుదల చేసిన బిజెపి జాబితాలో డికె అరుణకు చోటు దక్కలేదు. కారణం ఆమె గద్వాల రాజకీయ చదరంగంకు పావులు కదిపింది. తాను గద్వాల నుంచి పోటీ చేయడం లేదని తన అనుచరుల దగ్గర చెప్పడంతో ఇప్పుడు నడిగడ్డ రాజకీ యం సందిగ్దంలో పడింది. డికె అరుణ ఊహించని షాక్ ఇవ్వడంతో ఒక్కసారి గద్వాల రాజకీ యం హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకు ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకుంది.ఆమె ఎక్కడ నుంచి పోటి చేస్తారు అన్నది ఆసక్తిగా మారింది.

ముళ్లును ముళ్లుతోనే తీయాలి

ముళ్లును ముళ్లుతోనే తీయాలన్నది పాత పెద్దల మాట. ఇప్పుడు కూడా అదే నానుడి గద్వాల రాజకీయంలో జరుగుతోంది. బిఆర్‌ఎస్ నేత, జడ్‌పి చై ర్మన్ సరితా తిరుపతికు ఇటీవల కాంగ్రెస్ గద్వాల నుంచి టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. గద్వాల నియోజకవర్గంలో వాల్మికి బోయ, కురుబ కులాల ఓట్లే కీలకం. ఈ రెండు కులాలు గెలుపు ఓటములను శాసిస్తాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రె స్ నుంచి కురుబ కులానికి చెందిన సరితను కాంగ్రె స్ తన అభ్యర్థిగా ప్రకటించింది. ఇక బిఆర్‌ఎస్ ను ంచి సిట్టింగ్ ఎమ్మల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డికి సి ఎం కెసిఆర్ కల్పించారు. దీంతో బిజెపి నుంచి పో టీ డికె అరుణ పోటీ చేస్తుందని అందరూ ఊహించారు. కాని ఆమె అనూహ్యంగా తన రాజకీయ పో టీ చేసే నిర్ణయాన్ని పునరాలోచనలో పడేసింది. ఎ ట్టి పరిస్థితిలో కాంగ్రెస్ గెలవకూడదనే లక్షంగా చేసుకొని తను రాజకీయ మెదడుకు పదను పెట్టి ంది. అందులో భాగంగానే గద్వాలో ఓటు బ్యాంక్ అధికంగా ఉన్న వాల్మికులకు బిజెపి నుంచి సీటు క ల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ మె గత కొంత కాలం క్రితం వాల్మీకులను ఎస్టీ జా బితాలో చేర్చాలని కోరుతూ బిజెపి అధినేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి డిల్లీలో అమిత్‌షాతో పాటు ఇతర పెద్దలను కలసి విన్నవించింది. దీంతో ఆమె గద్వాలో వాల్మీకి ఓట్లపై దృష్టి సారించినప్పటికీ కాంగ్రెస్ నుంచి సరితను ఆ పార్టీ నిలబెట్టడడంతో బిజెపి నుంచి వాల్మీకులకు అవకాశం ఇ వ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

బిజెపి నుంచి వీరబాబు ?

గద్వాలకు చెందిన వాల్మీకి నేత వీరబాబు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ నేత. ఆయన గతంలో బిఎస్‌పి నుంచి గద్వాలలో పోటీ చేసి ఓడిపోయా రు.అనంతరం కాంగ్రెస్‌లో చేరి చురుకుగా ఉంటున్నారు. అయితే ఆయన తన అనుచరులతో కలిసి మంగళవారం బిజెపి నేత డికె అరుణను కలి సి తమ కులానికి బిజెపి నుంచి టికెట్ ఇవ్వాలని కోరారు. అందుకు ఆమె సూచన ప్రాయంగా ఒప్పుకున్నట్లు సమాచారం. వాల్మీకి కులానికి బిజెపి ను ంచి టికెట్ ఇస్తే అటు కాంగ్రెస్‌కు దెబ్బ పడుతుంద ని గ్రహించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నా రు.అందులో బాగంగానే వీరబాబు టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వా ల్మికి కులుం నుంచి రామాంజనేయులు, సీనియర్ బిజెపి నేత అ య్యపు రెడ్డి , ప్రముఖ న్యాయవాది వెంకటాద్రి రెడ్డి కూడా ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వీరిలో వీరబాబుకు ఎక్కవ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

రెండు పొట్టేళ్లు కొట్లాడుకుంటే మధ్యలో పులికే న్యాయం

రెండు పొట్టేళ్లు కొట్లాడుకుంటే పులికే న్యాయం జరిగినట్లు కాంగ్రెస్ నుంచి కురుబ కులం నుంచి స రిత, బిజెపి నుంచి పోటీ చేసే వాల్మీకి నేతకు మధ్య పోటీ పెడితే మధ్యలో బిఆర్‌ఎస్ నేత బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. బిఆర్‌ఎస్ చేపట్టిన అభివృద్ధి, సిఎం కెసిఆర్ ప్రవేశ పెట్టిన అభివృద్ధ్ది సంక్షేమ పథకాలు బిఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయని అంచనాలు వేస్తున్నా రు.బిఆర్‌ఎస్‌కు కూడా బిసిలతో పాటు అన్ని వర్గా ల్లో ఓటింగ్ శాతం ఉండడంతో గెలుపుపై ప్రభావం పడుతుంద ని రాజకీ య విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే గ ద్వాలో 20 04కు ము ందు బిసి నే త వా ల్మీకి కులానికి చెందిన గ ట్టు బీము డు ఎమ్మెల్యేగా ఉ న్నారు. ఆ యన బిఆర్‌ఎస్‌లో చేరి గత కొన్ని స ంవత్సరా ల క్రితం మరణించా రు. ఆయన తమ్ము డు గట్టు తిమ్మప్ప ప్రస్తుతం బిఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారు. అప్పటి నుంచి గద్వాల రాజకీయంలో రెడ్లదే ఆదిపత్య రాజకీయం కొనసాగుతోంది.

డికె అరుణ దారెటు ?

గద్వాల నుంచి 2004,2009,2014 వరుసగా హాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందిన డికె అరుణ 20 14లో మేనల్లుడు బిఆర్‌ఎస్ అధినేత బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అనంతరం ఆ మె బిజెపిలోకి చేరి జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉ న్నారు. సీనియర్ రాజకీయ నేతగా కొనసాగుతున్నారు. ఈ సారి గద్వాల నుంచి పోటీ చేసేందుకు విముఖత చూపడంతో ఆమె దారెటు అనే ప్రశ్న ఉ దయిస్తోంది. ఆమె రాజకీయ పయనం ఎటువైపు ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. ఆమె గద్వాలను వీడితే ఆమె పాలమూరు అసెంబ్లీ నుంచా. లేక పార్లమెంట్‌కు పోటీ చేస్తుందా అన్న చర్చ నడుస్తోంది.

మరో వైపు బిజెపి నుంచి నారాయణపేట నుంచి కూడా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమచారం. ఆమె పుట్టినిళ్లు నారాయణపేట జిల్లా ధ న్వాడ మండలం కావడంతో ఆమె నారాయణపేట నుంచి పోటీ చేసే ఆవకాశాలు ఉన్నట్లు సమా చా రం. ఆమె తండ్రి దివంగత మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డికి నారాయణపేట నియోజకవర్గంలో మం చి పట్టు ఉంది. ఈ నేపథ్యంలోనే బిజెపి ఓటు బ్యా ంక్ తో పాటు తన అనుచరులు కూడా ఉండడంతో ఆమె నారాయణ పేట నుంచి రంగంలోకి దిగవచ్చునని సమాచారం. ఇక్కడ తన ప్రధాన అనుచరుడు శివకుమార్ రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ, కాంగ్రెస్ నుంచి ఎర్రశేఖర్‌కు టికెట్ కేటాయిస్తే ,శివకుమార్ రెడ్డి బిజెపిలోకి వెళ్లే అవకాశం ఉంది. ఈ నేఫథ్యంలో డికె అరుణకు టికెట్ కల్పిస్తే బిఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ఒక వేళ సమీకరణలు మారితే పార్లమెంట్‌కు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News