Saturday, December 21, 2024

వాస్తవాలు మాట్లాడితే రోషం ఎందుకు?: డికె అరుణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్‌పై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ ఖండించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీరు గుమ్మడికాయదొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుందని ఆమె ఆక్షేపించారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ రెండు ఒకటేనని ఎన్నోసార్లు రుజువైందని.. వాస్తవాన్ని ఈటల చెబితే కాంగ్రెస్ నేతలకు అంత రోషం ఎందుకన్నారు. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలకు డబ్బులు అందాయని ప్రజలు అనుకుంటున్నారని ఈటెల చేసిన వ్యాఖ్యలు వాస్తవం కాదా అని ఆమె ప్రశ్నించారు.

ఆ పార్టీల లోపాయికారీ ఒప్పందం మూడు ఉప ఎన్నికల్లో తేలిందన్నారు. ఈటల రాజేందర్ కాంగ్రెస్‌ను విమర్శిస్తే.. బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఎందుకు స్పందించారని డికె అరుణ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గల్లీలో లేదు.. ఢిల్లీలోనూ లేదని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసుతో సంబంధం లేదని రేవంత్ ప్రమాణం చేస్తారా? అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారుడు. బడుగు బలహీనవర్గాల నాయకుడిని ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే బిజెపి చూస్తూ ఊరుకోదని ఆమె హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News