Sunday, December 22, 2024

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల్‌లో పోటీకి దూరం: డికె అరుణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ స్పష్టం చేశారు. బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ తాను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, గద్వాల నియోజకవర్గంలో బీసీ అభ్యర్థికి అవకాశం ఇస్తామని చెప్పారు. తమ పార్టీ బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ముందుకు సాగుతోందని, అందుకే తన స్థానంలో బీసీకి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. గద్వాల నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తాను ఇటీవలే చెప్పినట్లు గుర్తు చేశారు. తాను తమ పార్టీ అభ్యర్థుల తరఫున తెలంగాణవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తానని తమ పార్టీ సీనియర్లు కేంద్రమంత్రి, పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ పోటీకి దూరంగా ఉన్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News