Sunday, December 22, 2024

అందరం కలిసి బిజెపిని అధికారంలోకి తీసుకొస్తాం: డికె అరుణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో రాబోయేది బిజెపి ప్రభుత్వమేనని జాతీయ ఉపధ్యక్షురాలు డికె అరుణ అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర బిజెపి పార్టీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నేను పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదు. బిజెపిలో కంఫర్ట్ గానే ఉన్నాను. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి బిజెపిపై కుట్రలు చేస్తున్నాయి. తెలంగాణలో బిజెపి బలంగా ఉంది. అందరం కలిసి బిజెపిని అధికారంలోకి తీసుకొస్తాం. అని జోస్యం చెప్పారు.

మరోవైపు, అంతర్గత సమస్యలతో బిజెపిలో ముసలం ఏర్పడింది. ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజగోపాల్ రెడ్డిలు పార్టీ నాయకత్వంపై అంసతృప్తి వ్యక్తం చేశారని, ఇందులో భాగంగానే రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ కుమార్ ను మార్చబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు పార్టీల్లో దుమారం రేపుతున్నాయి.

Also Read: ఖమ్మంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News