Tuesday, January 21, 2025

డికె అరుణ క్షమాపణలు చెప్పాలి : మెట్టు సాయికుమార్

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో పదవులు అనుభవించి పార్టీ మారిన నీచ చరిత్ర డికె అరుణ ఇప్పుడు బిజెపిలో తన మైలేజ్ కోసం కన్నతల్లి లాంటి కాంగ్రెస్ మీద ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బిజెపిని నమ్మే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ ఆదరణ పెరుగుతుందన్న భయంతోనే డికె అరుణ ఇలాంటి ఆరో పణలు చేశారని, తక్షణమే తన మాటలను వెనక్కి తీసుకోని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో ఒకే స్థానం గెలిచిన చరిత్ర బిజెపిదని, వచ్చే ఎన్నికల్లో కూడా బిజెపి సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందన్నారు. 2023 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగర వేస్తామని ధీమా కనబర్చారు. రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్రకు వస్తున్న స్పందన చూసి బిజెపి నేతలకు పిచ్చి పట్టుకుందని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News