Tuesday, January 21, 2025

అసెంబ్లీ కార్యదర్శిని కలిసిన డికె అరుణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అసెంబ్లీ కార్యదర్శిని బిజెపి నేత డికె అరుణ కలిశారు. హైకోర్టు తీర్పు కాపీని కార్యదర్శికి డికె అరుణ అందజేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో సరైన సమాచారం ఇవ్వలేదని కృష్ణ మోహన్ రెడ్డిపై అనర్హత వేటు వేశారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిని ఆరేళ్లు పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా హైకోర్టు అనర్హుడిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కృష్ణ మోహన్ రెడ్డి తప్పుడు సమాచారం సమర్పించడంతో ఆయనను ఎంఎల్ఎగా అనర్హుడిగా కోర్టు ప్రకటించిడంతో పాటు ఆయన ఎన్నికల చెల్లదని తీర్పు వెల్లడించింది. రెండో స్థానంలో ఉన్న డికె అరుణను ఎంఎల్ఎగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Also Read: 10 నిమిషాలు ముద్దు పెట్టుకున్నందుకు రెండు నెలలు విశ్రాంతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News