Sunday, January 19, 2025

మహబూబ్ నగర్ లో ఉత్కంఠకు తెర.. స్వల్ప మెజార్టీతో డికె అరుణ విజయం

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్ లో ఉత్కంఠకు తెరపడింది. పోటాపోటీగా సాగిన పోరులో బీజేపీ అభ్యర్థి డికె అరుణ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డిపై 4,500 ఓట్లతో ఆమె గెలుపొందారు. ఇక, మెదక్ బిజెపి అభ్యర్థి రఝునందర్ రావు కూడా గెలిచారు. దీంతో కాంగ్రెస్, బిజెపి పార్టీలు చెరో 8 సీట్లలో విజయం సాధించాయి. ఇక, హైదరాబాద్ లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా, లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు రాష్ట్ర ప్రజలు భారీ షాకిచ్చారు. దీంతో ఎన్నికల్లో కారు ఆచూకి కూడా కనిపించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News