Wednesday, January 22, 2025

విజయోత్సాహం: కంటతడి పెట్టుకున్న డికె శివకుమార్

- Advertisement -
- Advertisement -

 

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయభేరీ మోగించడంతో ఆనందంతో ఉద్వేగానికి లోనైన కెపిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్ కంటనీరు పెట్టుకున్నారు. తాను జైలులో గడిపిన రోజులను తలచుకుని శనివారం ఆయన రోదించారు. బిజెపి నాయకులు తనని జైలుకు పంపినపుడు నన్ను కలుసుకోవడానికి మా నాయకురాలు సోనియా గాంధీ జైలుకు వచ్చిన విషయాన్ని తాను ఎన్నటికీ మరచిపోను అంటూ ఆయన ఉద్వేగంగా అన్నారు. తనకు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తామని బిజెపి ఆశచూపినప్పటికీ తాను జైలుకు వెళ్లడానికే ఇష్టపడ్డానని ఆయన చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News