Wednesday, January 22, 2025

కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి బిజెపి కుట్రలు:డికె

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు బిజెపి కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ఆరోపించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓ వ్యూహం ప్రకారం బిజెపి వర్గాలు కర్నాటక వెలుపల ఈ దిశలో తమ ఎత్తుగడలకు దిగుతోందని తెలిపారు. సంబంధిత విషయంపై తమకు నిర్థిష్ట సమాచారం ఉందన్నారు. తగు విధంగా దీనిని ఎదుర్కొంటామన్నారు.

రాష్ట్ర మంత్రి బైరేగౌడ కూడా ఇదే విషయం తెలిపారు. బిజెపికి మంచి చెడు ప్రమేయం లేదని, ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చేయడమే వీరి పని అని, పలు రకాల కుయుక్తులకు దిగుతున్నారని, ఇక్కడైనా ఇతర చోట్ల నుంచి కానీ ఏదో విధంగా కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎసరు పెట్టాలని చూస్తున్నారని, వీటిని తిప్పికొట్టాలని గౌడ పిలుపు నిచ్చారు. ఇతర సర్కారులను పడగొట్టడంలో బిజెపి పేరు తెచ్చుకుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News