Thursday, January 23, 2025

శివకుమార్‌ను ఢిల్లీకి పిలిచిన కాంగ్రెస్ హైకమాండ్!

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కాంగ్రెస్ అగ్రనాయకత్వం(హైకమాండ్) కర్నాటక రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డి.కె. శివకుమార్‌ను ఢిల్లీకి పిలిచింది. కర్నాటక ముఖ్యమంత్రి పదవి కోసం సిద్దరామయ్య, శివకుమార్ పోటీపడుతున్నారు. వారి మద్దతుదారులు కూడా ఏ మాత్రం తగ్గకుండా రెచ్చిపోతున్నారు. కాగా ఆయన ఢిల్లీకి రాత్రి 7.00 గంటల వరకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. సిద్దరామయ్య ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. అయితే శివకుమార్ మాత్రం ఉదయం జర్నలిస్టులతో తాను ఢిల్లీకి వెళ్లబోనని అన్నారు. బెంగళూరుకు పెద్ద సంఖ్యలో వస్తున్న పార్టీ క్యాడర్‌తో కలవాల్సి ఉందన్నారు.

కాంగ్రెస్ అధిష్ఠానం శివకుమార్‌ను ఢిల్లీకి పిలిచిందని, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీతో సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేయనుందని సమాచారం.

ఇదిలావుండగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఆర్గనైజర్ కె.సి.వేణుగోపాల్ ‘ ఎన్నికల ఫలితాలు మే 13నే వచ్చాయి. ప్రజాస్వామిక రాజకీయ పార్టీలో చర్చలు జరుగుతాయి. పార్టీలో ఎలాంటి సమస్యలు లేవు. ఉన్నా వాటిని పరిష్కరించుకుంటాం. కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది త్వరలోనే ప్రకటిస్తాం’ అన్నారు. కాంగ్రెస్ నాయకత్వం శివకుమార్‌ను ఉపముఖ్యమంత్రిగా, రాష్ట్ర పార్టీ చీఫ్‌గా ఉంచాలనుకుంటోంది. కానీ తన బలం 135 మంది ఎంఎల్ఏలని శివకుమార్ అంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News