Friday, January 10, 2025

కాంగ్రెస్ అభ్యర్థులను ఆయన ట్రాప్ చేస్తున్నారు…

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థులను ట్రాప్ చేసుందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సునాయాసంగా గెలవబోతుందని శివకుమార్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థులకు కెసిఆర్ స్వయంగా సంప్రదిస్తున్నారని ఆరోపించారు. కెసిఆర్ ప్రయత్నాల గురించి తమకు పార్టీ అభ్యర్థులు చెబుతున్నారని వెల్లడించారు. గెలిచిన వారిని క్యాంపులకు తరలించే అవసరం ఉందబోదని ఆయన వెల్లడించారు.

డిసెంబర్ 30న జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం 49 కేంద్రాలను ఎన్నికల సంఘం ఎంపిక చేసింది. 113 నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు 14 టేబుళ్లు ద్వారా జరుగనుంది. 500 లకు పైగా పోలింగ్ కేంద్రాలున్న 6 నియోజకవర్గాల్లో 28 టేబుళ్లను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. డిసెంబర్ 30న జరిగిన ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News