Thursday, January 23, 2025

సిద్ధరామయ్యపై డికె ఘాటు వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్నాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఉద్ధేశించి ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ బుధవారం చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. గతంలో సిద్ధరామయ్య సిఎంగా ఉన్నప్పుడు ఓ ప్రాజెక్టు గురించి తటపటాయించారని, తానైతే నిరసనలకు భయపడకుండా ముందుకు వెళ్లేవాడినని వ్యాఖ్యానించారు. బెంగళూరు నగర నిర్మాత కెంపెగౌడ జయంతి ఉత్సవాల నేపథ్యంలో విధాన సౌధ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి పదవిని ఆశించి భంగపడ్డ శివకుమార్ మాట్లాడారు. రాష్ట్రంలో పలు టన్నెల్స్, ఫ్లైఓవర్ల నిర్మాణానికి తనకు అభ్యర్థనలు అందుతున్నాయని ఈ సభలో కుమార్ చెప్పారు. 2017లో బెంగళూరులో స్టీల్ వంతెన నిర్మాణ ప్రతిపాదన జరిగింది.

అయితే దీనిని పలువురు వ్యతిరేకించారని, దీనితో అప్పటి సిఎం సిద్ధరామయ్య, బెంగళూరు నగర నిర్మాణాభివృద్ధి వ్యవహారాల మంత్రి కెజె జార్జి నిరసనలకు జడిసినట్లు, తానైతే కథ వేరే విధంగా ఉండేదని వ్యాఖ్యానించారు. తనకు దక్కిన ఉప ముఖ్యమంత్రి పదవి పట్ల డికె అసంతృప్తిగానే ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అనుకున్న పనులను సిద్ధరామయ్య సకాలంలో పూర్తి చేయడం కష్టమని పలుసార్లు ఇటీవలే డికె తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు వెల్లడైంది. ఈ పరిణామాలతో డికె , సిద్ధ మధ్య కుదిరిన బలవంతపు రాజీ ఏ మలుపు తిరుగుతుందో అనే ఆత్రుత కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. కాగా డికె వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు.

సిద్ధరామయ్య భయపడ్డారని చెప్పడం కుదరదని, కొన్ని సందర్భాలలో ముఖ్యమంత్రి అయినా ఇతర నేతలుఅయినా ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా వెళ్లడం కష్టం అని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా కొన్ని దశలలో ఊహాజనిత విషయాలు ప్రచారంలోకి వస్తాయి. మంచి నిర్ణయాలు ఆలస్యం అవుతాయని తెలిపారు. ఇదే డిప్యూటి సిఎం మనోగతం అయి ఉంటుందన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News