- Advertisement -
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి పదవిపై డికె శివకూమార్ ఎట్టకేలకు స్పందించారు. అధిష్టానం సూచనతో సిఎం కావాలనే ఆశను వదులుకున్నట్లు వెల్లడించారు. తనను సిఎం చేసేందుకు కార్యకర్తలంతా భారీగా ఓట్లు వేశారని శివకుమార్ పేర్కొన్నారు. అధిష్ఠానం మరో నిర్ణయం తీసుకుందన్నారు. కార్యకర్తల ఆకాంక్షలు మాత్రం వృథా కావని శివకుమార్ స్పష్టం చేశారు. కార్యకర్తలంతా మరింత ఓపికతో వేచిచూడాలని సూచించారు. పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కనకపురలో పార్టీ కార్యకర్తల భేటీలో పాల్గొన్న శివకుమార్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
- Advertisement -