Monday, December 23, 2024

కాంగ్రెస్‌‌కు మద్దతిచ్చిన ప్రజలకు ధన్యవాదాలు: శివకుమార్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు శనివారం కొనసాగుతోంది. వెలువడిన ఫలితాల్లో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డికె శివకుమార్ కనకపుర అసెంబ్లీ స్థానం నుండి గెలుపొందారు. ఈ సందర్భంగా శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ… కర్నాటక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారని తెలిపారు. సమిష్టి కృషితో కర్నాటక ఎన్నికల్లో గెలిచామన్నారు. గాంధీ కుటుంబంపై ప్రజలు విశ్వాసం ఉంచారని తెలిపారు. రాష్ట్ర స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు నేతలు శ్రమించారని శివకుమార్ వెల్లడించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో మద్దతిచ్చారని ఆయన వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News