Sunday, November 17, 2024

ఎంఎల్ఎ డికె ఆస్తులు మొత్తం రూ 1,400 కోట్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా కర్నాటక ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత డికె శివకుమార్ నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ 1,400 కోట్లు దాటింది. సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో రెండు మూడవ స్థానాలలో కూడా కర్నాటక ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇక ఈ జాబితాలో నిరుపేదగా పశ్చిమబెంగాల్‌కు చెందిన ఎమ్మెల్యే రికార్డులోకి వచ్చారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిజెపి ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ ధారా తన ఆస్తుల విలువ రూ 1700 అని ప్రకటించారు. తరువాతి క్రమంలో రూ 15000 ఆస్తుల ఎమ్మెల్యేగా ఒడిషాకు చెందిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మకరంద ముదులి నిలిచారు. పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే నరీందర్ పాల్ సింగ్ సావ్నా రూ 18,370లతో కూడిన ఎమ్మెల్యే అయ్యాడు. ఎన్నికల సంస్కరణల ఆలోచనల ఎడిఆర్ నివేదిక మేరకు ఎమ్మెల్యేల సంపన్నత వివరాలు వెలుగులోకి వచ్చాయి.

అత్యంత ధనిక ఎమ్మెల్యేల జాబితాలో రెండో వ్యక్తిగా నిలిచిన కెహెచ్ పుట్టస్టామి ఆస్తుల విలువ రూ 1,267 కోట్లు. మూడో సంపన్న ప్రజా ప్రతినిధి ప్రియాకృష్ణ. విలువ రూ 1,156 కోట్లు. సంపన్న ఎమ్మెల్యే జాబితాలో తొలి పది స్థానాలలో నలుగురు కాంగ్రెస్‌కు చెందినవారు, ముగ్గురు బిజపికి చెందిన వారు ఉన్నారు. సంపన్న ఎమ్మెల్యేల జాబితాలోని పేర్లపై బిజెపి , కాంగ్రెస్‌లు పరస్పర విమర్శలకు దిగాయి. కాంగ్రెస్‌కు చెందిన రిజ్వాన్ అర్షద్ స్పందిస్తూ డికె వంటివారు ఆది నుంచి వ్యాపార రంగంలో ఉన్నారు. ఇందులో తప్పేమీ లేదన్నారు. ఇక బిజెపి సంపన్న ఎమ్మెల్యేల వివరాలు చూస్తే వీరంతా మైనింగ్ స్కామ్‌ల్లో కూరుకువెళ్లిన వారే ఉన్నారు. దీనికి బిజెపి నేత సురేష్ కుమార్ జవాబిస్తూ కాంగ్రెస్ ధనికులనే ప్రేమిస్తుందని, వారికే టికెట్లు ఇస్తుంది. వారు వారినే గెలిపించుకుంటారని వ్యాఖ్యానించారు.

కాగా తమ పార్టీలో స్కామ్‌ల్లో చిక్కిన వారికి ప్రజలు బుద్ధిచెప్పారని అన్నారు. కాగా తాను సంపన్నుడిని కాను అలాగని నిరుపేదను కానని డికె స్పందించారు. చాలాకాలంగా తాను సంపాదించినదే అని, తన డబ్బు ఓ వ్యక్తి పేరిట ఉందని, ఈ విధంగా తాను సంపన్నుడిని అనుకోరాదని, పేదను కూడా కాదని వ్యాఖ్యానించారు. కాగా సంపన్న ఎమ్మెల్యేల జాబితాలో గాలి జనార్దన రెడ్డి 23వ స్థానంలో ఉన్నారు. దేశంలోని 20 మంది అత్యంత ధనికులైన ఎమ్మెల్యేల్లో 12 మంది కర్నాటకకు చెందిన వారే ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News