డీకే శివకుమార్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..
హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్
బెంగళూరు : కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను డేగ ఢీకొట్టడంతో తృటిలో ప్రమాదం తప్పింది. దీంతో హెలికాప్టర్‌ను బెంగళూరు హెచ్‌ఎఎల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ముళ్‌బాగల్ అనే ప్రాంతానికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ అద్దం పగిలి పోగా, డీకే కెమెరామన్ స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనలో డీకేతోపాటు ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి, పైలట్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
Also Read: హెలికాప్టర్‌ను ఢీకొట్టిన పక్షి.. డికె శివ కుమార్‌కు తప్పిన ప్రమాదం
ప్రజల ఆశీస్సులతో బయటపడ్డాం.. డీకేఎస్ ట్వీట్
ఎన్నికల ప్రచారం కోసం జక్కూరు నుంచి ముళ్‌బాగల్‌కు వెళ్తుండగా హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే ప్రమాదం జరిగిందని డికె ట్వీట్ చేశారు. తనతో ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి, పైలట్‌కు స్వల్ప గాయాలయ్యాయన్నారు. పైలట్ అప్రమత్తమై ఎవర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో సురక్షితంగా బయటపడ్డామని, ఇదంతా ప్రజల ఆశీశ్శుల వల్లే క్షేమంగా బయటపడ్డామని చెప్పారు.
While on our way to Mulbagal, our helicopter met with an accident, in which my fellow passengers were injured.
Thanks to the wishes of all Kannadigas, I am safe, and I thank the pilot for his quick response in making an emergency landing.
Travelling to Mulbagal by road now. 🙏
— DK Shivakumar (@DKShivakumar) May 2, 2023