Monday, December 23, 2024

DK Shivakumar : ఎన్నికల ప్రచారంలో నోట్ల వర్షం.. వివాదంలో డీకే శివకుమార్

- Advertisement -
- Advertisement -

మాండ్యా: కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు డీకే శివకుమార్ కర్ణాటకలోని మాండ్యా జిల్లా బేవినహళ్లిలో ఎన్నికల ప్రచారంలో కరెన్సీ నోట్లను విసురుతూ కెమెరాకు చిక్కారు. శివకుమార్ బస్సులో పర్యటిస్తున్న సమయంలో వాహనంపై నుంచి రూ.500 నోట్లను జల్లు కురిపిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కర్ణాటకలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ఉన్న శివకుమార్, జనతాదళ్ (సెక్యులర్)కి కంచుకోటగా భావించే మాండ్యా జిల్లాలో ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నించారు. ‘ప్రజాధ్వని యాత్ర’లో శివకుమార్ తన ఎన్నికల ర్యాలీ వాహనం పక్కనే ఉన్న సాంస్కృతిక కళాకారులపై నోట్లను చిమ్ముతూ కనిపించిన సంఘటన పెద్ద వివాదాన్ని రేకెత్తించింది. కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ ప్రస్తుతం 121 స్థానాలను కలిగి ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే, శివకుమార్ చర్యలపై పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని పలువురు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News