- Advertisement -
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు శనివారం కొనసాగుతోంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 68, బిజెపి 39, జెడిఎస్ 16, ఇతరులు 04 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటికే కర్నాటకలో కాంగ్రెస్ (62), బిజెపి(27), జెడిఎస్(06) ఇతరులు (02) స్థానాల్లో విజయం సాధించారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు లెక్కింపు జరుగుతోంది. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డికె శివకుమార్ వెలువడిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల 2023 ఎన్నికల ఫలితాల్లో కనకపుర అసెంబ్లీ స్థానం నుండి గెలుపొందారు. శివకుమార్ రాష్ట్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఆర్ అశోక్, జనతాదళ్ సెక్యులర్ (జెడిఎస్) అభ్యర్థి నాగరాజ్‌పై పోటీ చేశారు. కనకపుర కాంగ్రెస్, డీకే శివకుమార్‌లకు కంచుకోట అన్న విషయం తెలిసిందే.
- Advertisement -