Monday, January 20, 2025

ఎగ్జిట్ పోల్స్ పై డికె శివ కుమార్ కీలక వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ అనుకూలంగా రావడంతో తెలంగాణ ఆ పార్టీ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ నేతలు నమ్మకంగా ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్‌పై కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికె శివ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కాంగ్రెస్ అభ్యర్థులతో టచ్‌లో ఉన్నట్లు తమకు సమాచారం అందిందన్నారు. తెలంగాణ ప్రజలు మాత్రం మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోని వస్తుందని శివ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంఎల్‌ఎలను కాపాడుకోవడానికి రిసార్ట్ రాజకీయాలు తమకు అవసరం లేదని, మా ఎంఎల్‌ఎలను ఎవరూ కొనుగోలు చేయలేరని, తమ నేతలు ఎంతో విశ్వాసంతో ఉన్నారని తెలియజేశారు. ఈ విషయంలో తమ పార్టీ జాతీయ, రాష్ట్ర నేతలంతా ఎంతో నమ్మకంతో ఉన్నారని ఆయన వివరించారు. డిసెంబర్ 2న డికె శివ కుమార్ హైదరాబాద్‌కు రానున్నారు. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర ఎన్నికల ఫలితా మానిటరింగ్ బాధ్యతలను శివ కుమార్‌కు అప్పంగించిన విషయం తెలిసిందే. ఒకవేళ హంగ్ ఏర్పడితే కాంగ్రెస్ అభ్యర్థులను బెంగళూరు తరలించే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News